EducationPoliticalTelangana

విద్యార్థినీని గదిలోకి తీసుకెళ్లి ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

విద్యార్థినీని గదిలోకి తీసుకెళ్లి ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

విద్యార్థినీని గదిలోకి తీసుకెళ్లి ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

Social media viral : విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినీని ఉపాధ్యాయుడు కంప్యూటర్ గదిలోకి తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సదరు ఉపాధ్యాయుడిని విచారించినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో విద్యార్థి సంఘాల నాయకులు సీరియస్ అయ్యారు.

బాలిక పై వెకిలి చేష్టలకు పాల్పడ్డ ఉపాధ్యాయుడిని వెంబడే విధుల నుంచి తొలగించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.అధికారులు స్పందించని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా, ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button