KhammamPoliticalTelangana

రాజకీయ పార్టీలకు అతీతంగా మార్చి 30న జరిగే అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయండి

రాజకీయ పార్టీలకు అతీతంగా మార్చి 30న జరిగే అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయండి

రాజకీయ పార్టీలకు అతీతంగా మార్చి 30న జరిగే అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయండి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె వి కృష్ణారావు

సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ( రిజిస్టర్డ్ ) రాష్ట్ర చైర్మన్ ఓరుగంటి ఆనంద్ పిలుపుమేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ పసుపులేటి నాసరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె వి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు . రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమ సంఘాలలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున హాజరై మార్చి 30న జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు . కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో లో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ ల స్కీం లో భాగంగా ఆరోవ గ్యారెంటీగా ప్రతి ఉద్యమకారునికి 250 చదరపు గజాల స్థలం , ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మరియు 25 వేల రూపాయలను పెన్షన్స్ సౌకర్యంగా కలపిస్తామన్నారు . కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను పూర్తిగా విస్మరించింది . ఉద్యమకారుల గుర్తింపు కమిటీని వేసి హామీలను నెరవేరుస్తామని చెప్పి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఎటువంటి కదలిక లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు . గత 8 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమ ఫోరం ఉద్యమకారుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును పదివేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలని ఉద్యమ చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో పగడాల నరేందర్ , లింగన బోయిన సతీష్ , నేలవేల్లి వెంకటేశ్వర రావు , భూక్య శ్రీనివాస్ నాయక్ , మహిళా జిల్లా అధ్యక్షరాలు రెడ్డే బోయిన వరలక్ష్మి , మీగడ రామారావు , కొట్టే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button