
ఆర్బీఐలో భారీ ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్, రూ.1.54 లక్షల జీతం
Web desc : రీజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు శుభవార్త. 2026 సంవత్సరానికి సంబంధించి గ్రేడ్ ‘B’ అధికారుల నియామక ప్రకటనను RBI విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డు (RBISB), ముంబై నిర్వహిస్తోంది. జనరల్, DEPR, DSIM కేడర్లలో గ్రేడ్ ‘B’ (డైరెక్ట్ రిక్రూట్మెంట్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సంఖ్య RBISB/DA/01/2026-27గా విడుదలైంది.
దరఖాస్తు తేదీలు : ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 2026 మే 20గా నిర్ణయించారు. అభ్యర్థులు RBI అధికారిక వెబ్సైట్ rbi.org.in ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
ఖాళీల వివరాలు మొత్తం పోస్టులు: 60
ఈ పోస్టుల్లో దివ్యాంగులకు (PwBD) కూడా రిజర్వేషన్లు కల్పించారు.
జీతభత్యాలు : ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ ప్రాథమిక వేతనం నెలకు రూ.78,450గా ఉంటుంది. ఇతర అలవెన్సులు కలిపి మొత్తం స్థూల వేతనం సుమారు రూ.1,54,936 వరకు ఉండొచ్చు (HRA మినహా). ఇది కేంద్ర స్థాయి ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో ఒకటిగా భావిస్తారు.
అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పోస్టుల వారీగా విద్యార్హతల్లో కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉండొచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాలి.
వయోపరిమితి : 2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. అంటే 1996 ఏప్రిల్ 2 తర్వాత, 2005 ఏప్రిల్ 1కి ముందు జన్మించిన వారు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు ఉంటాయి.
ఎంపిక విధానం. ఈ నియామక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.
ఫేజ్-1 ఆన్లైన్ పరీక్ష
ఫేజ్-2 ఆన్లైన్/వ్రాత పరీక్ష
ఇంటర్వ్యూ : పరీక్ష సిలబస్, మార్కుల విధానం, ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో అందుబాటులో ఉన్నాయి.
గతంలో పరీక్ష రాసిన వారికి నిబంధన జనరల్/EWS అభ్యర్థులు ఈ పోస్టుకు గతంలో ఫేజ్-1 పరీక్షను ఆరు సార్లు రాసి ఉంటే మళ్లీ అప్లై చేయడానికి అర్హులు కారు. అయితే SC, ST, OBC, PwBD అభ్యర్థులకు ఈ పరిమితి వర్తించదు.
ఇంటర్వ్యూకు అవసరమైన పత్రాలు. వయస్సు ధృవీకరణ పత్రం (10వ తరగతి సర్టిఫికెట్ లేదా జనన ధృవీకరణ పత్రం)
విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు. కులం / EWS / దివ్యాంగ / మాజీ సైనికుల ధృవీకరణ పత్రాలు (అవసరమైతే) ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ వంటి గుర్తింపు పత్రం
ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటౌట్, ఫీజు రసీదు
అభ్యర్థులకు సూచన : దరఖాస్తు చేసేముందు పూర్తి నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవడం మంచిది. ఏవైనా సవరణలు, కొత్త ప్రకటనలు RBI అధికారిక వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారు. కాబట్టి అభ్యర్థులు తరచుగా వెబ్సైట్ను పరిశీలించాలి.




