NationalPoliticalTelangana

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్‌ఐ

Social media viral : బెంగళూరు రాష్ట్రంలో అవినీతి అనేది ఉండరాదని నూతన సీఎం డీకే శివకుమార్‌ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్ర పోలీసులు అందుకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. పరాయి రాష్ట్రంలో లంచం తీసుకుంటూ అక్కడి ఏసీబీకి దొరికిపోవడంతో రాష్ట్ర పోలీసుల పరువు ప్రశ్నార్థకమైంది.

రూ.2 లక్షలు ఇవ్వాలని.. వరకట్నం వేధింపుల కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి రాజస్థాన్‌కు వెళ్లిన బెంగళూరు హెచ్‌ఏఎల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ అనిత, హెడ్‌ కానిస్టేబుల్‌ ఉళవప్ప, కానిస్టేబుల్‌ యతీష్‌ అక్కడి ఏసీబీకి పట్టుబడ్డారు.

హెచ్‌ఏఎల్‌ పీఎస్‌లో నమోదైన కట్నం వేధింపుల కేసులో నిందితుడు జైపూర్‌లో ఉన్నాడని తెలిసి అరెస్టు చేయడానికి వెళ్లారు. నిందితుని ఇంటికి వెళ్లి బేరసారాలు ప్రారంభించారు. తమకు రూ.2 లక్షల లంచం ఇస్తే, అరెస్టు చేయకుండా వెళ్లిపోతామని తెలిపారు.

అంత మొత్తం ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పిన నిందితుడు, ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. ఓ లాడ్జిలో రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా స్థానిక ఏసీబీ అధికారులు అనిత, ఇతర పోలీసులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వీరి బాగోతం బెంగళూరు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button