HyderabadPoliticalTelangana

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం

web desc : గచ్చిబౌలిలో ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏఎంబీ(AMB) ఫ్లైఓవర్‌పై జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రాంగ్ రూట్‌లో వస్తున్న స్కూటీని ఎదురుగా వచ్చిన బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్లను శ్రీకాంత్, విఠల్‌ పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బుల్లెట్ బైక్ రైడర్ వినోద్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

స్థానికుల ప్రకారం.. ఈ ఫ్లైఓవర్‌పై తరచూ వాహనాలు రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్నాయి. పోలీసుల పర్యవేక్షణ, కఠిన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. సరైన నియంత్రణ ఉంటే ఈ ప్రాణనష్టం తప్పించుకోవచ్చని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button