
ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారిపై కేసు నమోదు
Web desc : పాల్వంచ పట్టణానికి చెందిన తంగెళ్లపల్లి శ్రావణి ఫిర్యాదు మేరకు,ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.
ఫిర్యాదు ప్రకారం,KTPS ఉద్యోగి కేశబోయిన కోటేశ్వరరావు మధ్యవర్తిత్వంలో ARROW ENTERPRISES కన్సల్టింగ్ డైరెక్టర్ తాళ్లూరి హరిబాబు 2023 సంవత్సరంలో పాల్వంచ మెడికల్ కాలేజ్,నర్సింగ్ కాలేజ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఫిర్యాదుదారురాలు తంగెళ్లపల్లి శ్రావణి వద్ద రూ.2,00,000/- వసూలు చేసినట్లు ఆరోపించబడింది.
అదేవిధంగా,బాధితులైన సురుగుల జ్యోతి వద్ద రూ.4,00,000/- మరియు గుడికందుల మాధురి వద్ద రూ.4,50,000/- వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొనబడింది. ఫిర్యాదుదారురాలు సుమారు 14 నెలలు పనిచేసినప్పటికీ 10 నెలల వేతనం మాత్రమే చెల్లించి,అనంతరం ఉద్యోగం నుండి తొలగించినట్లు తెలిపింది.
ఉద్యోగం కల్పిస్తామని లేదా తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి సుమారు ఏడాది పాటు కాలయాపన చేసి,ప్రస్తుతం డబ్బులు తిరిగి ఇవ్వకుండా,అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి,అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టడం జరుగుతోంది.దర్యాప్తులో తేలిన ఆధారాల మేరకు సంబంధిత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును.




