
వైఎస్ షర్మిలకు శస్త్రచికిత్స.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి షాకింగ్ పోస్ట్!
web desc : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల తనకు ఉదర భాగంలో (అబ్డామినల్) విజయవంతంగా సర్జరీ జరిగినట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ప్రస్తుతం తాను వేగంగా కోలుకుంటున్నానని స్పష్టం చేశారు.
ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫొటోను పంచుకున్న షర్మిల.. తన ఆరోగ్యం పట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తన ఆరోగ్యం గురించి నిరంతరం విచారిస్తూ, ప్రేమ మరియు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ వైఎస్ షర్మిల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఉదర సంబంధిత సర్జరీ విజయవంతంగా ముగిసిందని తెలిపినప్పటికీ, ఈ శస్త్రచికిత్స ఎక్కడ, ఏ ఆసుపత్రిలో జరిగింది? ఎప్పుడు నిర్వహించారు? అనే పూర్తి వివరాలను ఆమె వెల్లడించలేదు. షర్మిల సోషల్ మీడియా పోస్టు ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు, అభిమానులు ఆమె త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ‘గెట్ వెల్ సూన్’ మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు.




