Khammam
Trending

గార్లఒడ్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

గార్లఒడ్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

గార్లఒడ్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ అక్టోబర్ 01 2026: ఏన్కూరు మండల పరిధి గార్లఒడ్డు గ్రామ పంచాయతీ లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని GPO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా, సులభంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందని అధికారులు తెలిపారు. రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులకు చేరేలా కార్డులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button