AdilabadPoliticalTelangana

పత్తి పంటలో గంజాయి సాగు.. 51 గంజాయి మొక్కలు స్వాధీనం

పత్తి పంటలో గంజాయి సాగు.. 51 గంజాయి మొక్కలు స్వాధీనం

సికె.న్యూస్. ప్రతినిధి.ఆదిలాబాద్

పత్తి పంటలో గంజాయి సాగు.. 51 గంజాయి మొక్కలు స్వాధీనం

రూ.5.10 లక్షల విలువైన గంజాయి మొక్కలు సీజ్.. ఒకరి అరెస్ట్

నేరడిగొండ పోలీసుల కఠిన చర్యలతో అక్రమ గంజాయి సాగుకు అడ్డుకట్ట

ఇచోడ రూరల్ సీఐ సిహెచ్ రమేష్

నేరడిగొండ మండలం అరేపల్లి గ్రామ శివారులోని ROFR పట్టా వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్యలో అక్రమంగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని నేరడిగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మొత్తం 51 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు నేరడిగొండ ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో అరేపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమి లో తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించిన ఒక వ్యక్తి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో అతడిని సిడాం గంగారాం(60), s/o జైతు అరేపల్లి గ్రామం, నేరడిగొండ మండలంగా గుర్తించారు. నిందితుడి పేరుపై ఉన్న ROFR పట్టా భూమిలో పత్తి పంట మధ్యలో గంజాయి మొక్కలను అంతర పంటగా రహస్యంగా సాగు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

భూమిలో సుమారు 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 51 గంజాయి మొక్కలను గుర్తించి వేర్లతో సహా తొలగించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ ఒక్కొక్కటి సుమారు రూ.10,000 చొప్పున మొత్తం రూ.5,10,000/- ఉంటుందని తెలిపారు. గంజాయి మొక్కలను సీజ్ చేసి నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

అక్రమంగా గంజాయి సాగు, విక్రయాలు లేదా రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఇచోడ రూరల్ సీఐ CH రమేష్ హెచ్చరించారు. గంజాయి సాగు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే నేరుగా జిల్లా ఎస్పీ గారికి 8712659973 నంబర్ కి వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button