
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృ*తి…
Web desc : వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పరిధిలోని పుల్గర్ చర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాకలి నిరంజన్ గురువారం అకాల మరణం చెందగా, ఆయన అంత్యక్రియలు పూర్తయిన మర్నాడే భార్య మొగులమ్మ కూడా కన్నుమూశారు. భర్త మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అనారోగ్యంపాలై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఒక్కరోజు వ్యవధిలోనే దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో వారి పిల్లలు శివ, కీర్తి అనాథలుగా మారారు. మరోవైపు, వృద్ధురాలైన నిరంజన్ తల్లి అలివేలమ్మ కొడుకు, కోడలిని కోల్పోయి దుఃఖంలో మునిగిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరూ దూరమవడంతో ఆ పిల్లల భవిష్యత్ప్రశ్నార్థకంగా మారింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగర్ల రఘునాథ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిరంజన్ సేవలను గుర్తుచేసుకుంటూ మంచి కార్యకర్తను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అనాథలుగా మారిన పిల్లలకు, వృద్ధ తల్లికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.




