KhammamPoliticalTelangana

మంత్రి పొంగులేటి ఔదార్యానికి కృతజ్ఞతలు తెలుపుకున్న బాధితుడు

మంత్రి పొంగులేటి ఔదార్యానికి కృతజ్ఞతలు తెలుపుకున్న బాధితుడు

స్పందనకు వందనం…!

మంత్రి పొంగులేటి ఔదార్యానికి కృతజ్ఞతలు తెలుపుకున్న బాధితుడు

సికె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం : సరిగ్గా రెండు నెలల క్రితం (జనవరి 2న) తిరుమలాయపాలెంలో ప్రజాపాలన సభ ముగించుకుని మంత్రి పొంగులేటి ఖమ్మం వస్తున్న సమయంలో ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి వద్ద వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

గమనించిన మంత్రి హుటహుటిన తన కాన్వాయ్ ను ఆపి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తికి ధైర్యం చెప్పారు. అనంతరం 108 ద్వారా ఖమ్మంలోని తన కిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించేందుకు చొరవ చూపారు.

ప్రస్తుతం తీవ్రగాయాల బారి నుంచి కోలుకున్న ఆ వ్యక్తి కుటుంబ సమేతంగా రెండు రోజుల క్రితం ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి తన పట్ల చూపిన ఔదార్యానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

ఆరోగ్యం సరిగ్గా చూసుకోవాలని బాధితుడికి మంత్రి పొంగులేటి సూచించారు. ఎల్లవేళలా ఆపదలో అండగా ఉంటాననే భరోసా కూడా ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button