అబద్దాలు ఆడడంలో హరీష్ రావును మించిన వారు ఎవరూ లేరు.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూస్తూ ఓర్వలేక ప్రభుత్వం పై మూడు నెలల నుండి విమర్శలు చేస్తున్నారు.
బాబా బామ్మర్దులు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలకు కల్లి బోల్లి కబుర్లు చెప్తున్నారు.
ప్రభుత్వం పై మసి పూసి మారేడు కాయ చేసినట్లుగా, బట్ట కాల్చి ప్రభుత్వంపై వేసే విధంగా హరీష్ రావు, కేటీఆర్, ఈమధ్య కవిత కూడా వీళ్లకు తోడైంది.
గత పది సంవత్సరాల మీ పరిపాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల కుప్పగా మార్చారు.
రైతులకు రైతు భరోసా అందిస్తే చూసి ఓర్వలేక పోతున్నారు.. మీ హయాంలో రైతులకు 40 కిలోల సంచికి 44 కిలోలు జోకి రైతులను నిలువున ముంచారు.
రైతు రుణమాఫీ పై రైతులను మోసం చేశారు.
రైతులకు రైతు భరోసా అందిస్తూ మొన్నటి రోజున ఎకరం, రెండు ఎకరాలు ఇలా రైతులకు అందిస్తే అబద్దాల హరీష్ రావు ఒక దుష్ప్రచారానికి తెరలేపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన నకీర్తి కనకవ్వ కు రైతు భరోసా విషయంలో 31 గుంటలు ఉంటే కేవలం 1650 రూపాయలు వేశారని హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు.
నకీర్తి కనకవ్వ కు 580/బి లో 4 గుంటలు, 943/10 లో 7 గుంటలు మొత్తం 11 గుంటలు ఉంటే దానికి 1650 రూపాయలు వస్తాయి.
కావాలంటే పొత్గల్ లోని వారి బ్యాంకు ఖాతాలో ఒకసారి సరి చూసుకోగలరు.
11 గంటలు ఉంటే 33 గుంటలు ఉన్నాయని హరీష్ రావు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు.
హరీష్ రావు ఒకసారి కళ్ళకు కంటి ఆపరేషన్ చేయించుకోవాలి.
దుష్ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా హరీష్ రావు నిలుస్తున్నారు.
హరీష్ రావు అసెంబ్లీలో కుల గణనపై కూడా ఇలానే అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాడు.
వారు చేసిన కులగణనను బయట పెట్టకుండా అటకెక్కించారు.
వారు 61 శాతం బీసీ లకు ఇచ్చామంటున్నారు తీరా చూస్తే 51 శాతమే ఉంది.
రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు.
నకీర్తి కనకవ్వ రైతు భరోసా విషయంలో హరీష్ రావు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం.
: ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు.