నేడు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.12,000 జమ
నేడు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.12,000 జమ;
నేడు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.12,000 జమ
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. ఎన్నికల్లో పైపై హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టేయడం కాకుండా.. వీలైనంతవరకూ హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోంది
ప్రభుత్వంపై విమర్శలు రావచ్చు, ఈ పాలన వేస్ట్ అని కొంతమందికి అనిపించవచ్చు. అదే సమయంలో ప్రయోజనాలు పొందుతున్న వారికి ఈ ప్రభుత్వ పాలన నచ్చుతుంది కూడా. సమస్య ఏంటంటే.. ప్రయోజనం పొందుతున్న వారు ఆ విషయాలేవీ బయటివారికి చెప్పట్లేదు. దాంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదనే అభిప్రాయం గ్రామాల్లో కనిపిస్తోంది. ఐతే.. అదే గ్రామాల్లో చాలా మంది ప్రయోజనాలు పొందుతున్నారు కూడా. తాజాగా రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం రెండో విడతగా అర్హులైన రైతుల అకౌంట్లలో ఇవాళ డబ్బు జమ చేస్తోంది.
ఇవాళ వారందరికీ జమ:
ఇటీవల 1 ఎకరం ఉన్న రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం జమ చేసింది. ఇక ఇవాళ 2 ఎకరాల లోపు భూమి ఉండి, సాగు చెయ్యడానికి అనుకూలంగా ఉంటే.. వారి అకౌంట్లలో డబ్బు జమ అవుతుంది. ఎకరానికి రూ.6,000 చొప్పున ఒక్కో రైతు అకౌంట్‌లో మొత్తం రూ.12,000 జమ చేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం దగ్గర రైతు భరోసాకి సంబంధించి అర్హులైన రైతుల జాబితా సంపూర్ణంగా ఉంది. అందువల్ల ఈ పథకాన్ని అమలు చెయ్యడం తేలికవుతోంది. అందువల్ల మొత్తం 1 కోటి 50 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు అకౌంట్లలో జమ కానున్నాయి. ఐతే.. ఒకేసారి భారీగా డబ్బు ఇవ్వడం కుదరకపోవడంతో.. ప్రభుత్వం విడతల వారీగా ఇస్తోంది. గత బుధవారం 1 ఎకరం ఉన్న మొత్తం 17.03 లక్షల మంది రైతులకు రూ.6,000 చొప్పున ఇచ్చింది. ఇలా మొత్తం రూ.533 కోట్లు జమ చేసింది.
ఎప్పుడు జమ అవుతుంది?
ఇవాళ బ్యాంక్ ఉద్యోగులు ఉదయం 10 గంటలకు బ్యాంకులకు వస్తారు. కానీ వచ్చీ రాగానే రైతుల సంగతి చూడరు. వారికి ఉండే రోజువారీ కస్టమర్లు, చెక్కుల క్లియరెన్స్ వంటివి ముందుగా చూస్తారు. దాంతో ఈ పని పూర్తయ్యే సరికి మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఆ తర్వాత రైతు భరోసా సంగతి చూస్తారు. ఒక్కో లబ్దిదారు పేరునూ గమనిస్తూ.. మనీ ట్రాన్స్‌ఫర్ చెయ్యాల్సి ఉంటుంది. అందువల్ల ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే సరికి.. సోమ, మంగళవారం పట్టొచ్చు. అందువల్ల ఇవాళ ఏ రైతు కైనా మనీ రాకపోతే, మంగళవారం సాయంత్రం వరకూ ఎదురుచూడాలి. అప్పటికీ రాకపోతే, బుధవారం బ్యాంకుకి వెళ్లి అడగొచ్చు లేదా దగ్గర్లోని వ్యవసాయ అధికారిని కలిసి అడగొచ్చు.
ఇది పూర్తైన తర్వాత.. 5 ఎకరాల లోపు పొలాలు ఉన్న రైతులకు ప్రభుత్వం డబ్బు జమ చెయ్యబోతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నిధుల సేకరణ పూర్తైంది. ఐతే.. ఈ ప్రక్రియను ఈ వారంలోనే చేసే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు సహకరిస్తే.. ఇది కూడా త్వరగా పూర్తవ్వగలదు.