దొర అహంకారాల పోకడలకు నిదర్శనం జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు…
దొర అహంకారాల పోకడలకు నిదర్శనం జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు…;
మీకు రాజ్యాంగం అంటే విలువలేదు,
గవర్నర్ అంటే గౌరవం లేదు…
ప్రజలు పక్కనబెట్టిన
పద్ధతుల్లో మార్పు రాకుంటే ఎలా…
దొర అహంకారాల పోకడలకు నిదర్శనం జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు…దొర అహంకారాల పోకడలకు నిదర్శనం జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు…
వ్యతిరేకించాల్సిన కేటీఆర్, హరీష్ సమర్ధించడంలో అర్ధం ఎంటి…
అసెంబ్లీ చైర్ పట్ల,దళిత ప్రజా ప్రతినిధుల
బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అహంకారపు మాటలు సమర్ధిస్తున్నారా..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసిన ఎమ్మెల్యే నాయిని..
కేటిఆర్,జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి, నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు..
అశోక జంక్షన్/హనుమకొండ
అసెంబ్లీలో స్పీకర్ గారి పై బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిపై సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం అని,దళిత ప్రజా ప్రతినిధుల పట్ల చులకన భావంతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను సమర్పిస్తున్న కేటిఆర్,హరీష్ రావు ఆంతర్యంలో దళితల పట్ల చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు.
ఆదివారం రోజున టీపీసీసీ పిలుపు మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే నాయిని ,KUDA చైర్మన్ ఇనగల వెంకట్రాం రెడ్డి పాల్గొన్నారు.పార్టీ కార్యాలయం నుంచి అశోక జంక్షన్ వరకు ర్యాలీగా వచ్చి కేటిఆర్,జగదీశ్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కనీస ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా రావడం లేదన్నారు,ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన బీసీ కులగణన సర్వేలో కేసీఆర్,కేటిఆర్,హరీష్ రావు పాల్గొనలేదని విమర్శించారు.
రాజ్యంగా బద్దమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.ప్రజా ప్రభుత్వ పాలనకు సలహాలు ఇవ్వాల్సింది పోయి సోషల్ మీడియా వేధికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని సైతం తమ రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.మీడియా ముసుగులో డబ్బులకు అమ్ముడు పోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
దొంగ యూట్యూబ్ ఛానల్ ల ద్వారా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యాకారులుగా చెప్పుకుని శవాల మీద పేలాల రాజకీయం చేస్తున్నారని అన్నారు.
మీ పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించారు,ఉద్యమకారులను,వరంగల్ జిల్లా అభివృద్ధిని విస్మరించిన మీరు అధికారం పోగానే లౌక్యం కోల్పోయి మాట్లాడుతున్నారని,మీ ఊకదంపుడు ఉపన్యాసాలకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అసెంబ్లీలో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఏకవచన సంబోధన మీరు సమర్థిస్తారా అని ప్రశ్నించారు.కెసిఆర్,కేటిఆర్ గారికి మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల పట్ల,బడుగు బలహీన ప్రజా ప్రతినిధుల పట్ల చిన్న చూపే ఉందని అన్నారు.జగదీశ్ రెడ్డి సస్పెండ్ చేస్తే కేటిఆర్,హరీష్ రావులు ధర్నా దిగడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.