ట్రాక్టర్‌పై నుండి పడి విద్యార్ది దుర్మరణం
ట్రాక్టర్‌పై నుండి పడి విద్యార్ది దుర్మరణం;
By : Ck News Tv
Update: 2025-03-23 04:08 GMT
ట్రాక్టర్‌పై నుండి పడి విద్యార్ది దుర్మరణం
గార్ల : ట్రాక్టర్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు కింద పడి విద్యార్థి మృతి చెందిన విషాద సంఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గార్ల మండలంలోని పూమ్యతండాకు చెందిన బానోత్ సాయి (14) అనే తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ట్రాక్టర్ పై వెళుతూ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుదుపుకు గురి కావడంతో ట్రాక్టర్
పై నుండి జారిపడి టైరు మీద నుండి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందారు.
ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్య అధికారి డాక్టర్ హన్మంతరావు విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాలుడు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.