లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మాస్ మీడియా అధికారి..

లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మాస్ మీడియా అధికారి..;

By :  Ck News Tv
Update: 2025-03-28 07:58 GMT

లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మాస్ మీడియా అధికారి..

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామంలో రెండు మూడు రోజుల క్రితం ఓ మైనర్ బాలిక అబార్షన్ విషయంలో తన మెడికల్ నుంచే మందులు సరఫరా అయ్యాయని అనుమానాలు వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్న ఓ మెడికల్ షాపును జిల్లా మాస్ మీడియా అధికారి గురువారం తనిఖీ చేస్తూ సీల్ చేశారు.

అయితే ఈ మెడికల్ షాపును తిరిగి ఓపెన్ చేయాలంటే తనకు రూ. 30 వేలు కావాలని బాధితుడిని లంచం అడిగినట్లు అధికారులు తెలియజేశారు.

బాధితుడు ఫిర్యాదు మేరకు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఉండగా సదరు మాస్ మీడియా జిల్లా అధికారి రవిశంకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలియజేశారు.

Full View

ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని మాస్ మీడియా అధికారి చాంబర్లో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News