
గిరిప్రదక్షిణలో దారుణం
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు యువతులపై అత్యాచారం
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణ దారిలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల్లో ఇద్దరు యువతులపై అత్యాచారం జరిగింది. గత నెల 30న తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఓ వివాహిత తన స్నేహితులతో కలిసి తిరువణ్ణామలై పౌర్ణమి గిరిప్రదక్షిణకు వచ్చింది.
స్నేహితులంతా గిరి ప్రదక్షణ చేసుకుని తిరుగు ప్రయాణం అవ్వగా వివాహిత, ఆమె స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుతున్న సమయంలో ఓ ముఠా మారణాయుధాలతో వారి వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడి వివాహితను అటవీప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడింది. వివాహితతో పాటు ఆమె స్నేహుతుడి దుస్తులు సైతం తీసి వారిని నగ్నంగా వీడియో తీసి అక్కడ నుండి పారిపోయింది.
మరుసటి రోజు నగ్నవీడియోలను వారికి పంపి రూ. లక్ష పంపాలని లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఆ వివాహిత ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరుసటి రోజే రాత్రి తిరువణ్ణామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరిప్రదక్షిణ చేస్తుండగా ఓ ముఠా ఇద్దరినీ బెదిరించి అటవీప్రాంతానికి తీసుకెళ్లి యవతిపై లైంగిక దాడికి పాల్పడింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు ఐదు బృందాలుగా నిందితుల కోసం దర్యాప్తు చేపట్టి 11 మంది నిందితులను గుర్తించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.




