PoliticalTelangana

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ దురుసు ప్రవర్తన

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ దురుసు ప్రవర్తన

చనిపోయే పాపకు సిరప్ ఎందుకు..ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ దురుసు ప్రవర్తన!

వైద్యారోగ్య శాఖను పూర్తిగా నాశనం…

ఆరునెలలుగా ఆసుపత్రిలో మందులు లేవు, సచ్చేటోళ్లకు సిరప్ లు పోయరు గ్లూకోజ్ లు, ఇంజెక్షన్లు మాత్రమే ఇస్తారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన డి.అనిల్ కుమార్ అనే వ్యక్తి కూతురు సుదీక్ష (2) రాత్రి 11 గంటల సమయంలో తీవ్ర అస్వస్థకు గురవడంతో, అప్పటికే ప్రైవేటు ఆసుపత్రులు మెడికల్ షాపులు మూసివేయడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తండ్రి

తన పాప కడుపునొప్పితో ఏడుస్తుందని, త్వరగా సిరప్ ఇవ్వాలంటూ డాక్టర్ ను వేడుకున్న తండ్రి అనిల్ కుమార్

ఆరు నెలలుగా ఆసుపత్రిలో మందులే లేవు, అయినా సచ్చేటోళ్లకు సిరప్ ఎందుకని, నీకు దిక్కుతోచిన చోట ఫిర్యాదు చేసుకోమని అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

దీంతో చేసేదేమీ లేక ఆసుపత్రి నుండి వెనుదిరిగి, తనకు పరిచయం ఉన్న మెడికల్ షాప్ ఓనర్ ఇంటికి వెళ్ళి షాపు తెరిపించి పాపకు సిరప్ తీసుకున్న అనిల్ కుమార్

ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

అర్ధరాత్రి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే, ఒక డాక్టర్ ఇలా మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button