EducationKhammamPoliticalTelangana

పురుగుమందు తాగి ఇంటర్ విద్యార్థిని మృతి…

పురుగుమందు తాగి ఇంటర్ విద్యార్థిని మృతి…

పురుగుమందు తాగి ఇంటర్ విద్యార్థిని మృతి…

తల్లాడ మండలంలో విషాదం..

తల్లాడ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌కు వెళ్లేందుకు ఇష్టపడని బాలిక పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మరణించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లాడ మండలం రామానుజవరం గ్రామానికి చెందిన ఐలూరి పూజిత (16) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకోనుంది.

ఆమెను ఖమ్మంలో ఓ ప్రైవేట్ కళాశాలలో చేరుస్తూ, హాస్టల్‌లో ఉండేలా తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు.

జూన్ 28వ తేదీన హాస్టల్‌కి వెళ్లాల్సి ఉండగా పూజిత తనకు హాస్టల్‌కి వెళ్లడం ఇష్టం లేదని తల్లికి తెలిపింది. కానీ తల్లిదండ్రులు హాస్టల్‌కి వెళ్లాల్సిందే అన్నారు.

ఇదే విషయంలో మనస్తాపానికి గురైన పూజిత అదే రోజు రాత్రి పురుగుమందు సేవించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రామకృష్ణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button