NationalPolitical

ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రికి అస్వస్థత

ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రికి అస్వస్థత

ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రికి అస్వస్థత

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్లో ప్రచారంలో పాల్గొన్న సమయంలో వేదికపైనే స్పృహతప్పి పడిపోయారు.
ప్రస్తుతానికి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఎన్నికల ర్యాలీలో ఆయన స్టేజ్పైన ప్రసంగిస్తున్నారు. అప్పటి వరకూ బాగానే మాట్లాడిన గడ్కరీ ఉన్నట్టుండి స్పృహ కోల్పోయారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. పక్కనే ఉన్న నేతలు వెంటనే స్పందించి ఆయనను గట్టిగా పట్టుకున్నారు.

తరవాత వైద్యులు వచ్చి పరీక్షించి చికిత్స అందించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు గడ్కరీ. మొదటి విడతలోనే ఆ స్థానానికి పోలింగ్ జరిగింది.

ప్రస్తుతానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు.సరైన సమయానికి చికిత్స అందించడం వల్ల గడ్కరీ వెంటనే కోలుకున్నారు. ఆ తరవాత మళ్లీ ప్రసంగాన్ని కొనసాగించారు.

ఈ స్పీచ్ అయిపోయిన వెంటనే ఆయన X వేదికగా పోస్ట్ పెట్టారు. ఉక్కపోతను తట్టుకోలేక స్పృహ కోల్పోయానని, ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

“ర్యాలీ జరుగుతున్న సమయంలో ఎందుకో చాలా నలతగా అనిపించింది. విపరీతమైన వేడి కారణంగా ఒక్కసారిగా స్పృహ తప్పింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను.

మరో సమావేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు”నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button