KhammamPoliticalTelangana

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టగా ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ముష్టికుంట్ల వద్ద చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన సూర్యనారాయణ, రుక్మిణి, మరో ఇద్దరు కలిసి కారులో బోనకల్‌ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ముష్టికుంట్ల వద్దకు రాగానే అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.

క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కాసేపటి తరువాత ఘటనా చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button