
ప్రపంచ టూ వీలర్ బైక్ మెకానిక్ జెండాను ఆవిష్కరించిన…
గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో ప్రపంచ టూ వీలర్ మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెకానిక్లు ఘనంగా వేడుకలు నిర్వహించారు. సీనియర్ మెకానిక్, తాటికుంట మాజీ సర్పంచ్ అంజి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్దకల్ ఎస్ఐ శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీహరి మాట్లాడుతూ.. ప్రతీ టూ వీలర్ మెకానిక్ తమ వద్దకు వచ్చే వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రయాణాల్లో ప్రాణ రక్షణకు హెల్మెట్ ఎంతో కీలకమని వివరించారు. అదేవిధంగా, ఎవరైనా అనుమానాస్పదంగా దొంగ బైక్లను అమ్మడానికి వస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.ఈ వేడుకల్లో తాటికుంట మాజీ సర్పంచ్ అంజి, మండలంలోని సీనియర్ మెకానిక్లు, సంఘ సభ్యులు మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




