Khammam

ఒక్క కన్నుతో చేసిన అభివృద్ధి ఆరు కళ్లతో ఏమి చేశారు

ఒక్క కన్నుతో చేసిన అభివృద్ధి ఆరు కళ్లతో ఏమి చేశారు

ఒక్క కన్నుతో చేసిన అభివృద్ధి ఆరు కళ్లతో ఏమి చేశారు

దూషణలే సీఎం రేవంత్ రాజకీయ ఎజెండా

కేసీఆర్ కృషితోనే సీతారామకు నీళ్లు – కాంగ్రెస్‌కు క్రెడిట్ లేదన్న పువ్వాడ

కాళేశ్వరం నీళ్లు వదలకుండా రైతులను నష్టపరుస్తున్నారు: పువ్వాడ

తెలంగాణ ప్రయోజనాలపై రేవంత్‌కు చిత్తశుద్ధి లేదు: పువ్వాడ

వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననమే సీఎం రేవంత్ ఎజెండాగా పెట్టుకున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. రోడ్డు ప్రమాదంలో జరిగిన దుర్ఘటన ఘటనలో తన కన్ను కోల్పోతే దానిని కించపరిచేలా గతంలోనూ ఇప్పుడు కూడా సీఎం రేవంత్ కించపరిచారని అన్నారు. హమీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ నేతలకు ఏ అంగ వైకల్యం అడ్డు వచ్చిందని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఉన్న ఒక్క కన్ను తోనే ఎంత గొప్పగా పని చేసి ఘన విజయాలతో ఎంత అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసన్నారు. మంత్రిగా నేను ఒక్క కంటితో చేసిన పని ఇప్పుడు ఉన్న ముగ్గురు మంత్రులు 6 కళ్లతో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన మీద సీఎం, మంత్రులకు ఉన్న కక్ష తీర్చుకోవాలని కానీ ప్రజల మీద కాదని విషయ పరిజ్ఞానం లేక ముఖ్యమంత్రి స్థాయి మరిచి కన్ను లేదని పన్ను లేదని దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సీతారామ ప్రాజెక్టు కోసం కృషి చేశానని వ్యక్తిగత విమర్శలతో తాత్కాలికంగా సంతృప్తి పడతారు కానీ ఎల్లకాలం ఉండదని ఇచ్చిన హామీలు అమలు చేయక డొంకతిరుగుడు మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అన్ని దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసి రైతు భరోసా ను మూడు సీజన్లు ఎగవేశారు దాంతో పాటు 420 హమీల్లో ఏదీ సరిగ్గా అమలు చేయలేదని మీరు విమర్శించిన నా ఒంటి కన్నుతో గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను రక్షించామని చెప్పారు.

ఎల్ నినో ప్రభావం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కాళేశ్వరంలో నీరు పారుతుందని వాస్తవమని నీరు వదలకుండా రైతులను నిండా ముంచుతున్నారని విమర్శించారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకి శ్రీకారం చుడితే నేనే తెచ్చానని మంత్రి తుమ్మల చెప్పుకుంటున్నారని
సీతారామ ప్రాజెక్టు కోసం 9 వేల కోట్లు ఖర్చు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది పెద్దగా ఏం లేదన్నారు.

కాంగ్రెస్ మంత్రులు నెత్తిన చల్లుకుని నీళ్లు కేసీఆర్ చేసిన సీతారామ ప్రాజెక్టు కృషి వల్లనే అవి గోదావరిని కృష్ణా నదిలో కలపాలని ఏ నాయకుడు కృషి చేయలేదని కేసీఆర్ ఒక్కరే దానికి శ్రీకారం చుట్టారు అని కొనియాడారు. నీళ్లు దిగువకు పోతుంటే ఏపీలో పట్టిసీమ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నీళ్లు ఎత్తి పోసుకుంటున్నారని రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల పట్ల కనీస చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. గతంలో భద్రాచలం వరకు 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చాయని అప్పుడు కొట్టుకుపోని భద్రాచలం ఇప్పుడు ఎందుకు కొట్టుకుపోతుందని ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button