
మాజీ సర్పంచ్ అనుమానాస్పద మృ*తి
Web desc : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మైసం వెంకటేశ్వర్లు (50) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృ*తి చెందారు.
తగిలేపల్లి శివారులోని తన వ్యవసాయ పొలం వద్ద ఆయన తీవ్ర గాయాలతో పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు.
పొలం సరిహద్దు వివాదం, పాత రాజకీయ విభేదాలే మృ*తికి కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు వర్ని సీఐ కృష్ణ తెలిపారు.
మృతుడు గతంలో ఒకసారి ఎంపీటీసీగా, రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు




