HealthHyderabadPoliticalTelangana

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. 11 మంది నకిలీ వైద్యుల అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. 11 మంది నకిలీ వైద్యుల అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. 11 మంది నకిలీ వైద్యుల అరెస్ట్

web desc : మహా నగరం హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్ కావడం తీవ్ర కలకలం గా మారింది. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న భారీ నకిలీ డాక్టర్ల ముఠా గుట్టును సిటీ పోలీసులు రట్టు చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు, డాక్టర్లుగా చలామణి అవుతున్న 11 మంది నకిలీ వైద్యులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కనీస వైద్య విద్య, గుర్తింపు పొందిన డిగ్రీలు లేకపోయినా.. పెద్ద పెద్ద ప్రిస్క్రిప్షన్ రాస్తూ, ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ ఇస్తూ సామాన్య ప్రజలను మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వీరిలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో ప్రైవేట్ క్లినిక్‌లు నడపడమే కాకుండా, మరి కొందరు ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పేర్లను వాడుకుంటూ వైద్య సేవలు అందిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి క్లినిక్‌ల నుంచి భారీ ఎత్తున నకిలీ లెటర్‌హెడ్‌లు, అనుమతి లేని మందులు, వైద్య పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అమాయక ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్న ఇలాంటి నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హత లేని వ్యక్తుల వద్దకు వెళ్లి చికిత్సలు చేయించుకోవద్దని ప్రజలకు పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button