Hyderabad
Trending

తీన్మార్ మల్లన్న పాదయాత్రకు 'బంజారా సేవా దళ్' మద్దతు

తీన్మార్ మల్లన్న పాదయాత్రకు 'బంజారా సేవా దళ్' మద్దతు

తీన్మార్ మల్లన్న పాదయాత్రకు ‘బంజారా సేవా దళ్’ మద్దతు

సి కె న్యూస్ ప్రతినిది హైదరాబాద్

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్రకు ‘బంజారా సేవా దళ్’ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సేవా దళ్ రాష్ట్ర నాయకులు నేరుగా మల్లన్న ని కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం మైదాన ప్రాంత గిరిజనులు (లంబాడీలు) ఎదుర్కొంటున్న పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

మైదాన ప్రాంత గిరిజనులకు జనాభా ప్రాతిపదికన తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కేటాయించాలని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీలుగా మారిన తండాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మైదాన ప్రాంత గిరిజనుల హక్కులపై ప్రత్యేకంగా చర్చించి తీర్మానం చేయాలని కోరారు.

మైదాన ప్రాంత గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలోనూ, ప్రభుత్వం వద్ద కూడా గళమెత్తాలని మల్లన్నను కోరినట్లు బంజారా సేవా దళ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా దళ్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button