
చిన్నమండవ గ్రామంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి .
చింతకాని మండలం
చిన్నమండవ గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ తంగిరాల మాధవి మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం జరిగిన అనేక పోరాటాలను గుర్తుచేశారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.. పంచాయతీ సెక్రెటరీ రామకృష్ణ మట్లాడుతు రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులు పడిన చారిత్రక సందర్భానికి గుర్తుగా నిలిచిందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘ప్రజా పాలన దినోత్సవం’ గా నిర్వహిస్తోందన్నారు
1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారని ఆ తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారని ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది అందుకే సెప్టెంబరు 17ను ప్రజా పాలన దినోత్సవం దినోత్సవం నిర్వహించడం జరుగుతుంద అన్నారు .. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రామకృష్ణ, వార్డు మెంబర్స్ శ్యామకూరి రామారావు , పర్చ వెంకటరాములు సోంపోగు రమణమ్మ , గుండ్ల అనిల్ కుమార్, గుండ్ల భద్రమ్మ కాసిమాల కిరణ్, కాసిమాల సరిత పాల్గొన్నారు.




