
భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు చేసిన భార్య.. ఇరువర్గాల మధ్య ఘర్షణ
Web desc : కరీంనగర్‌లో కుటుంబ కలహాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణతో బీభత్సం సృష్టించారు. వివరాల్లోకెల్తే.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆరెపల్లికి చెందిన దంపతులు రాజు లావణ్యల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలతో లావణ్య తల్లిగారి ఇంటికి వెళ్లింది.
అయితే రెండు నెలల క్రితం రాజు అక్రమ సంబంధం గుట్టు రట్టు చేయడంతో కుటుంబంలో కలహాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. దాన్ని మనసులో పెట్టుకొని భార్యను తరచూ కొట్టేవాడని సమాచారం. భర్త టార్చర్ భరించలేక అమ్మవారి ఇంటికి వెళ్లిన లావణ్యను కొద్ది రోజుల క్రితం మంచిగా చూసుకుంటానని నమ్మించి రాజు తిరిగి భార్య లావణ్యను ఇంటికి తీసుకువచ్చాడట.
కానీ గతంలాగానే టార్చర్ పెట్టడంతో మళ్లీ తల్లిగారి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అయితే లావణ్య వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో భర్త రాజు మాట్లాడదామని కరీంనగర్‌లోని హనుమాన్ నగర్‌కు వెళ్లగా.. భర్త రాజు కుటుంబ సభ్యులు, భార్య కుటుంబ సభ్యులపై కట్టెలతో దాడి చేసినట్లు తెలుస్తుంది.
అయితే ఇరువర్గాలు కర్రలు, బండరాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో హనుమాన్ నగర్ పరిస్థితి భీభత్సంగా మారింది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోసం సంప్రదించగా.. ఫిర్యాదు అందలేదు అని చెప్పుకొస్తున్నారు. కాగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తున్నాయి.




