
మహిళపై క్యాబ్ డైవర్ లైంగిక దాడి యత్నం!
Web desc : గచ్చిబౌలికి చెందిన మహిళా ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆ క్యాబ్‌లో బయలుదేరిన సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు.
మహిళా దగ్గర రూ.60 వేలు ఉండటం అతడు గమనించాడు. ఈ క్రమంలోనే తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద అతడు కారు రూట్ మార్చాడు. ఓఆర్ఆర్‌పై వెళ్లకుండా సర్వీస్ రోడ్డులోకి కారును డ్రైవర్ మళ్లించాడు. కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో అతను కారు నిలిపివేశాడు.
ఆ కారులోనే మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. భయంతో కారు నుంచి దిగి బాధితురాలు కేకలు వేయడంతో క్యాబ్ డ్రైవర్ భయపడి పరారయ్యాడు. కారులో ఉన్న రూ.60 వేల బ్యాగ్‌తో నిందితుడు ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదుతో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ఆర్జీఐఏ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




