Khammam
Trending

మత్స్యకారులను కాపడబోయి పోలీసుల గల్లంతు

మత్స్యకారులను కాపడబోయి పోలీసుల గల్లంతు

ఖమ్మం జిల్లాలో మత్స్యకార సొసైటీ సభ్యులను రక్షించబోయి ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గల్లంతు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్డీఆర్‌ఎఫ్ బృందం ఉన్న రెండు బోట్లు గల్లంతయ్యాయి. తొలుత బేతుపల్లి చెరువులో 8మంది మత్స్యకార సొసైటీ సభ్యులు చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) సిబ్బంది వెళ్లారు. ముందుగా ముగ్గురిని ఎస్డీఆర్‌ఎఫ్ బృందం కాపాడింది. మరో ఐదుగురిని కాపాడే ప్రయత్నంలో అలుగులో రెండు ఎస్డీఆర్‌ఎఫ్ బోట్లు కొట్టుకుపోయాయి. ప్రమాద సమయంలో రెండు బోట్లలో 11మంది ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఎస్డీఆర్‌ఎఫ్ బృందం కోసం మరో బోటు సాయంతో ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.. అంతకుముందు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో నీటిలో 8 మంది మత్స్యకార సొసైటీ సభ్యులు చిక్కుకుపోయారు. బేతుపల్లి చెరువుకు అలుగుపడటంతో చాపలు కొట్టుకుపోకుండా వల కట్టేందుకు వెళ్లి వరద ఉధృతికి సొసైటీ సభ్యులు నీటిలో చిక్కుకుపోయారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఒక బోటులో ముగ్గురు సొసైటీ సభ్యులను సురక్షితంగా రెస్క్యూ టీం ఒడ్డుకు చేర్చింది. రెండు బోట్లతో ఐదుగురు సొసైటీ సభ్యులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు రెస్క్యూ టీమ్ వెళ్లింది. చెరువులో చిక్కుకుపోయిన సొసైటీ సభ్యులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు చేపడుతున్న సహాయక చర్యలను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి బేతుపల్లి చెరువుకు వరద పోటెత్తుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button