MuluguPoliticalTelangana

నిండు గర్భిణికి డెలివరీ చేసిన అంబులెన్స్‌ టెక్నీషియన్‌...

నిండు గర్భిణికి డెలివరీ చేసిన అంబులెన్స్‌ టెక్నీషియన్‌...

నిండు గర్భిణికి డెలివరీ చేసిన అంబులెన్స్‌ టెక్నీషియన్‌…

ములుగు : పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లిన ఓ నిండు గర్భిణికి డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించారు. అంబులెన్స్‌ సిబ్బందే అన్నీ తామై ఆ గర్భిణికి డెలివరీ చేసిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో గురువారం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండలం దూలాపురానికి చెందిన మోడెం సమ్మకకు పురిటి నొప్పులు రావడంతో ఆశా వర్కర్ శ్రీదేవి అంబులెన్స్‌కు సమాచారం అందించింది.

ప్రసవం కోసం ఆమెను తొలుత వాజేడు పీహెచ్‌సీకి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు రెఫర్‌ చేశారు.

ఏటూరునాగారం వైద్యశాలకు తీసుకెళ్లగా.. సమ్మక్కకు రక్తహీనత సమస్య ఉందని, 6 శాతం మాత్రమే రక్తం ఉండటంతోపాటు ఉమ్మనీరు తగ్గిపోవడాన్ని గుర్తించి ములుగు జిల్లా వైద్యశాలకు రెఫర్‌ చేశారు.

అంబులెన్స్‌లో ములుగు తీసుకొస్తుండగా గోవిందరావుపేట సమీపంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌ టెక్నీషియన్‌ శివలింగప్రసాద్‌ ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. సమ్మక్కకు ఇది ఐదో కాన్పు.

ఈఆర్‌సీపీ డాక్టర్‌ మౌనిక సలహాతో కావాల్సిన మందులు అందించి.. తల్లి, శిశువును జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రసవం చేసిన అంబులెన్స్‌ సిబ్బందికి సమ్మక్క కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈఎంటీతో పైలట్‌ యాకూబ్‌ పాషా, ఆశా వర్కర్ శ్రీదేవి ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button