PoliticalSanga reddyTelangana

ఎస్సీ, ఎస్టీ చట్టాలను అవమానించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి పై తీవ్ర ఖండన

ఎస్సీ, ఎస్టీ చట్టాలను అవమానించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి పై తీవ్ర ఖండన

ఎస్సీ, ఎస్టీ చట్టాలను అవమానించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి పై తీవ్ర ఖండన
ఏప్రిల్ (21) సి కె న్యూస్ అబ్దుల్లా ఉస్మాన్ నారాయణఖేడ్ జిల్లా సంగారెడ్డి.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగించాయని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బోర్గి భీమన్న గారు తెలిపారు.

ఎమ్మెల్యే గారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని “బోగస్ కేసులు”గా వ్యాఖ్యానించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలను అవమానించినట్టేనని ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు సభలో ఉన్న సమయంలోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం మరింత దురదృష్టకరమని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం అనేది సామాజిక న్యాయం, రక్షణ కోసం రూపొందించిన కీలక చట్టమని, దానిని చిన్నచూపు చూడడం అసహ్యకరమని భీమన్న గారు అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలు రేకెత్తించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా సంబంధిత నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత గౌరవం, హక్కులు కల్పించాలని, ఎటువంటి కుల వివక్షకు తావులేకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button