
విశ్వవాణి ప్రార్థన మందిరానికి మంచినీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్ లోయ ఉపేందర్
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని మండలంలోని నరసింహపురం గ్రామంలో ఉన్న విశ్వవాణి ప్రార్థన మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు గ్రామ సర్పంచ్ లోయ ఉపేందర్ శాశ్వత పరిష్కారం చూపించారు.
ప్రార్థన మందిరం ప్రారంభమైనప్పటి నుంచి తాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘ పెద్దలు, దైవజనులు, విశ్వాసులు ఇటీవల సర్పంచ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు. గ్రామపంచాయతీ మంచినీటి పైప్‌లైన్‌ను ప్రార్థన మందిరానికి అనుసంధానం చేయాలని నిర్ణయించి, పనులు పూర్తయ్యే వరకు స్వయంగా పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నారు.
సర్పంచ్ చొరవతో తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో ప్రార్థన మందిరానికి వచ్చే విశ్వాసుల ఇబ్బందులు తొలగిపోయాయి.
ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఆరాధన అనంతరం సర్పంచ్ లోయ ఉపేందర్ చేతుల మీదుగా నీటి పంపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా రెవ. పి. విజయకుమార్ మాట్లాడుతూ, ప్రార్థన మందిరానికి అత్యంత అవసరమైన మంచినీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ సేవాభావం అభినందనీయమని పేర్కొన్నారు.సంఘ పెద్దలు, దైవజనులు, విశ్వాసులు సర్పంచ్ లోయ ఉపేందర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే ప్రజాప్రతినిధుల వల్లే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.




