PoliticalTelanganaWarangal

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని యువకుడి ఆత్మ*హత్యాయత్నం

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని యువకుడి ఆత్మ*హత్యాయత్నం

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని యువకుడి ఆత్మ*హత్యాయత్నం

భార్యాభర్తల వివాదంతో మనస్తాపం..

web desc : భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న కుటుంబ వివాదంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లోకి పరుగెత్తిన ఘటన వరంగల్‌లో శుక్రవారం కలకలం రేపింది.

ఈ ఘటనలో యువకుడితో పాటు అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. మిల్స్‌కాలనీ పోలీసుల వివరాల ప్రకారం.. కట్ల హర్షిత్‌ (25)కు ప్రేమ వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయి.

వీరికి ఓ కుమారుడు ఉన్నట్లు సమాచారం. వివాదం నేపథ్యంలో సుమారు రెండు నెలల క్రితం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం కోర్టుకు హాజరయ్యే సమయంలో హర్షిత్‌ పెట్రోల్‌ బాటిల్‌ తీసుకెళ్లి భార్య కుటుంబ సభ్యులను బెదిరించినట్లు సమాచారం. అనంతరం మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

మంటలతోనే పోలీస్‌స్టేషన్‌లోకి పరుగెత్తగా పోలీసులు వెంటనే స్పందించి అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హర్షిత్‌తో పాటు స్టేషన్‌ రైటర్‌ ప్రవీణ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ మగ్దూంకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button