HyderabadPoliticalTelangana

పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ మోసం..!

పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ మోసం..!

పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ మోసం..!

web desc : ఉప్పల్‌: ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వివాహానికి ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేసి రూ.50 వేల అడ్వాన్స్‌ చెల్లించిన ఓ కానిస్టేబుల్‌.. బాధితురాలికి తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్న ఘటనలో ఎట్టకేలకు రిమాండ్‌కు వెళ్లాడు. గత నెల 25 వ తేదీన కేసు నమోదు చేసిన ఉప్పల్‌ పోలీసులు, దర్యాప్తు అనంతరం రెండు రోజుల క్రితం నిందితుడు శెట్టి అరుణ్‌కుమార్‌ (34)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

నాగోలు శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసముంటున్న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడకు చెందిన అరుణ్‌కుమార్‌ ప్రస్తుతం లక్ష్మీకాపూల్‌లోని ఉమెన్స్‌ సేఫ్టీ వింగ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2013-15లో ఎం.టెక్‌ చదువుతున్న సమయంలో ఉప్పల్‌ ప్రశాంత్‌నగర్‌కు చెందిన యువతితో పరిచయం ఏర్పడి, అనంతరం ప్రేమగా మారింది.

బాధితురాలు తీవ్ర ఆవేదనకు గురై… దాదాపు పదేళ్లుగా కొనసాగిన సంబంధంలో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాబోయే నవంబర్‌ 1న పెళ్లి చేసుకుందామని బాధితురాలిని నమ్మించిన అరుణ్‌కుమార్‌, ఇద్దరూ కలిసి ఓ ఫంక్షన్‌ హాల్‌ను బుక్‌ చేసి రూ.50 వేల అడ్వాన్స్‌ కూడా చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూనే, ఆమెకు తెలియకుండా గత జూలై 1న మరో యువతిని వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆ విషయాన్ని దాచిపెట్టి బాధితురాలితో మునుపటిలాగే మాట్లాడటం, తిరగడం కొనసాగించాడు. చివరకు అసలు విషయం బయటపడటంతో బాధితురాలు తీవ్ర ఆవేదనకు గురై ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉప్పల్‌ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్‌ చేసి రెండు రోజుల క్రితం రిమాండ్‌కు తరలించినట్లు ఉప్పల్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button