
మహిళా సిబ్బందిపై వేధింపులు.. ఇద్దరు వెల్నెస్ సెంటర్ డాక్టర్ సస్పెండ్!
ఇటీవల ప్రభుత్వం జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలోని వెల్నెస్ సెంటర్లో మహిళా వైద్యులు, సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిపై జిల్లా కలెక్టర్ దివాకరన్ టి.ఎస్. కఠిన చర్యలు తీసుకున్నారు.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పరిపాలనా యంత్రాంగం సదరు వైద్యుడికి గట్టి షాక్ ఇచ్చింది.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు అదనపు కలెక్టర్ శ్రీజ నాయకత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసి, ఈ నెల 5న కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదికలో ఆరోపణలు నిజమేనని తేలడంతో కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు.
కమిటీ ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా సదరు వివాదాస్పద వైద్యుడిని తక్షణమే ఆరోగ్యశాఖ డైరెక్టర్‌కు సరెండర్ చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. అలాగే అనుమతి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. నరేందర్‌ను కలెక్టర్ ఆదేశించారు.
ఆసుపత్రుల్లో మహిళా సిబ్బందికి భద్రత, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, బాధ్యులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఈ చర్య ద్వారా జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.




