Bhadradri KottagudemPoliticalTelangana

రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్‌ వార్డెన్‌

రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్‌ వార్డెన్‌

రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్‌ వార్డెన్‌

Web desc : లంచం తీసుకుంటూ మరో ప్రభుత్వ అధికారి శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాల్వంచ ఎస్టీ బాలుర హాస్టల్‌లో వార్డెన్‌ గా, రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భుక్యా వాలుసింహ రూ.14 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

హాస్టల్‌లో పనిచేసే సిబ్బంది ఒకరు ఆగస్టు నెలలో ఆరు రోజుల పాటు అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు. ఈ విషయంలో తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని , జీతంలో కోతలు వేయవద్దని రికార్డు అసిస్టెంట్‌ భుక్యా వాలుసింహాను కోరాడు.

అందుకు ప్రతిఫలంగా లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు డబ్బు ఇవ్వగానే అవినీతి అధికారి భుక్యాను పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి వరంగల్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button