
అర్ధరాత్రి భర్త దారుణ హ*త్య.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన తల్లీకొడుకు..
Web desc : భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని ఇస్లాంపూర్‌కు చెందిన కొండపురం శ్రీరాములు (50) బోరు బండిపై పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కొంతకాలంగా భార్యతో కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి భార్య భర్తల మధ్య మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తల్లి కొడుకు కలిసి శ్రీరాములు కళ్లలో కారం చల్లి దారుణంగా హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం తల్లీకొడుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.




