పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం;
పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 30 దుస్తుల షాపులు
హైదరాబాద్లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీ దివాన్దేవిడిలోని నాలుగో అంతస్తులో ఉన్న బట్టల షాపులో తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
ఈ మంటలు వ్యాపించి మరో 30 షాపులకు అంటుకున్నాయి. వెంటనే అగ్నిప్రమాద సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు
షార్ట్ షర్క్యూట్ కారణంగా..
వరుస షాపులకు మంటలు వ్యాపించడంతో భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలు ఎలా వ్యాపించాయనే విషయం ఇంకా తెలియదు. షార్ట్ షర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవల మరో భారీ అగ్ని ప్రమాద ఘటన కూడా హైదరాబాద్లో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగ మొత్తం అలుముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే కంపెనీలో సడెన్గా మంటలు ఎలా జరిగాయనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.