బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై మంత్రి అనుచరుల దాడి?

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై మంత్రి అనుచరుల దాడి?;

By :  Ck News Tv
Update: 2025-02-28 08:36 GMT

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై మంత్రి అనుచరుల దాడి?

సహించేదిలేదన్నఎమ్మెల్సీ కవిత

నాగర్ కర్నూలు జిల్లా: ఫిబ్రవరి 28

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు గురువారం రాత్రి వీరంగం సృష్టించారు. మండలంలోని సాతా పూర్‌లో ఫ్లెక్సీలు కడుతున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికిపాల్పడ్డారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం కొల్లాపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దకొత్తపల్లి మండలంలోని సాతా పూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పా టు చేస్తున్నారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అనుచరులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకుడు, కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ గుజ్జల పరమేశ్‌పై దాడికి పల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం గురువారం రాత్రి డిశ్చార్జ్‌ అయ్యారు.

పరమేశ్‌ను ఈరోజు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. దాడి సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ చోద్యం చూస్తూ ఉండి పోయారని ఆరోపించారు.

Similar News