పెండ్లింట తీవ్ర విషాదం...

పెండ్లింట తీవ్ర విషాదం...;

By :  Ck News Tv
Update: 2025-02-23 05:22 GMT

పెండ్లింట తీవ్ర విషాదం...

వెడ్డింగ్​కార్డులు పంచేందుకు వెళ్లిన ఇద్దరు యువకుడు యాక్సిడెంట్ లో మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది.

దీంతో పెండ్లింట తీవ్ర విషాదం నింపింది. పోలీసుల తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లా కరీమాబాద్ ఉర్సుకు చెందిన ఎర్ర కృష్ణకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

కూతురు పెండ్లి ఆదివారం ఉండగా, చిన్న కొడుకు ఎర్ర అఖిల్(24), అతని ఫ్రెండ్ పెద్దపల్లి జిల్లా రామగిరికి చెందిన గడ్డం చైతన్య(24) తో కలిసి శుక్రవారం బంధువులకు కార్డులు పంచడానికి బైక్​పై వెళ్లారు. అనంతరం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆరేపల్లి నుంచి హైదరాబాద్ వైపు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు.

హన్మకొండ జిల్లా రెడ్డిపురం వద్దకు రాగానే మహీంద్రా కారు స్పీడ్ గా వచ్చి బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాల పాలైన అఖిల్, చైతన్య స్పాట్ లో చనిపోయారు. కాకతీయ వర్సిటీ పోలీసులు స్థలానికి చేరుకొని వెళ్లి డెడ్ బాడీలను ఎంజీఎంకు తరలించారు. యాక్సిడెంట్ కు కారణమైన గోలమర్రి అజిత్ పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.

Similar News