ప్రిన్సిపాల్ వేధింపులు.. మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా

ప్రిన్సిపాల్ వేధింపులు.. మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా;

By :  Ck News Tv
Update: 2025-03-01 05:37 GMT

ప్రిన్సిపాల్ వేధింపులు.. మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా


వరంగల్ ఎల్.బి కళాశాల భవనం వద్ద మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ ధర్నా చేపట్టారు. L.B కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

L.B కళాశాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి హర్షవర్ధన్ రెడ్డిని టీచర్ సమస్యలపై ప్రశ్నించినందుకు కళాశాల యాజమాన్యం వేధిస్తున్నారని నిరసన చెప్పారు.

ఎమ్మెల్సీ ప్రచారంలో టీచర్ సమస్యలను తీర్చాలని అడిగినందుకు కళాశాల నోటీసులు ఇవ్వగా తీసుకోకపోవడంతో కళాశాల నుండి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ హుకుం జారీ చేశారు.

ఏడు సంవత్సరాలుగా ఫిలాసఫీ సబ్జెక్టులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు రాధ. L.B కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రిన్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని పలు అభియోగాలు ఉన్నాయి.

కళాశాలలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రిన్సిపల్ కి భయపడి ఎవరు చెప్పుకోవట్లేదని తెలిపారు రాధ.

ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ క్రింద నడుస్తున్న కళాశాలలో ప్రిన్సిపల్ ఏకేపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.

కళాశాలలో జరుగుతున్న అన్యాయాలను ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ దృష్టి సారించాలని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News