KhammamTelangana

రూ.3కోట్ల అప్పు చేసి వ్యాపారి పరారి...

రూ.3కోట్ల అప్పు చేసి వ్యాపారి పరారి...

రూ.3కోట్ల అప్పు చేసి వ్యాపారి పరారి…

సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి ఓ వ్యాపారి రూ.3కోట్ల అప్పు తీసుకుని పరారైన ఘటన సత్తుపల్లి మండల పరిధిలో జరిగింది. సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గంగారంలో జ్యువెల్లరీస్ షాపు, వస్త్ర దుకాణాలు పెట్టాడు.

తాళ్లమడ గ్రామంలో చికెన్, మటన్ షాపులనూ నడిపాడు. తాళ్లమడ, సత్తుపల్లి, గంగారం, బేతుపల్లి, పాకలగూడెం తదితర గ్రామాలకు చెందిన వారి వద్ద అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి, సుమారు రూ.3కోట్ల మేర అప్పులు తీసుకున్నాడు.

అప్పులు ఇచ్చిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వకుండా గ్రామం నుంచి వారం క్రితం అదృశ్యమయ్యాడు. బాధితులు సదరు వ్యక్తిపై సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button