NalgondaPoliticalTelangana

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి…

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి…

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి…

ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వసం….

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే దేవరకొండ మండలం మర్రిచెట్టు తండా కు చెందిన మూడవత్ నందిని మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ప్రసూతి కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.

ఆమెకు ఆపరేషన్ చేయగా మగ శిశువు జన్మించాడు. శిశువుకు పరిస్థితి బాగాలేదు అంటూ హైదరాబాదుకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.

హైదరాబాద్ కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు.

అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బిడ్డ మరణించాడని మృతి చెందిన తర్వాత తమకు సీరియస్ గా ఉంది హైదరాబాద్ కి తీసుకెళ్లాలని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న బంధువులు దేవరకొండ ప్రభుత్వాసుపత్రి కి చేరుకొని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడంతో దేవరకొండ పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వసo డ్యూటీలో ఉన్న డాక్టర్లపైన నర్సులపైన చర్యలు తీసుకోవాలని బంధువులు ఆరోపణ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button