PoliticalTelangana

ఓవర్ స్పీడ్తో గోడను ఢీ కొట్టిన బైక్.. తెలంగాణ విద్యార్థి స్పాట్ డెడ్

ఓవర్ స్పీడ్తో గోడను ఢీ కొట్టిన బైక్.. తెలంగాణ విద్యార్థి స్పాట్ డెడ్

ఓవర్ స్పీడ్తో గోడను ఢీ కొట్టిన బైక్.. తెలంగాణ విద్యార్థి స్పాట్ డెడ్

ఓ ప్రమాదంలో తెలంగాణకు చెందిన భారతీయ విద్యార్థి వియత్నాంలోని కాన్ థో నగరంలో మృతిచెందాడు. మృతుడిని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అర్షిద్ అశ్రిత్‌గా అక్కడి అధికారులు గుర్తించారు.

అర్షిద్ అక్కడ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో అర్షిద్ నడిపిన బైకు వేగంగా రావడంతో అది అదుపుతప్పి గోడను ఢీకొట్టింది.

ఈ ప్రమాద సమయంలో అతనితోపాటు ఉన్న అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ వేగంగా వెళుతుందని, అదుపుతప్పి నేరుగా గోడను ఢీకొనడంతో ఇద్దరూ పైకి ఎగిరి పడిన దృశ్యాలు దగ్గరలోని సిసిటివీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ వీడియోలో మొదట ఓ ప్రశ్నతంగా ఉన్న వీధి కనిపిస్తుంది. అలా ఉన్న సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ బైకు గోడను చాలా గట్టిగా గుద్దుతుంది. ఢీకొట్టే వేగం ఎంతగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఢీ కొట్టిన తర్వాత ఇద్దరూ గాల్లోకి ఎగిరిపోతూ కనిపించారు.

ఇకపోతే మృతి చెందిన అర్షిద్ తల్లిదండ్రులు అర్జున్, ప్రతిమలు ఆసిఫాబాద్‌లో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ విషాదకర సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు స్పందించారు. మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ప్రక్రియ వేగంగా జరగాలంటూ విజ్ఞప్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button