KhammamPoliticalTelangana

పేదింటి కలలు నెరవేర్చుతున్న ఇందిరమ్మ ప్రభుత్వం

పేదింటి కలలు నెరవేర్చుతున్న ఇందిరమ్మ ప్రభుత్వం

పేదింటి కలలు నెరవేర్చుతున్న ఇందిరమ్మ ప్రభుత్వం –

చింతకానిలో ఇందిరమ్మ ఇళ్ల స్లాబుల ప్రారంభం…..

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

చింతకాని : పేదల సొంతింటి కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చింతకాని మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల స్లాబుల పనులను గ్రామ సర్పంచ్ కిలారు మనోహర్ బాబు ప్రారంభించారు.

గ్రామానికి చెందిన ముప్పారపు వెంకాయమ్మ, రెడ్డెబోయిన పుష్పకాజ్యం వారి ఇందిరమ్మ ఇళ్ల స్లాబులకు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల కలలను నెరవేర్చేందుకు, పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి అర్హ కుటుంబానికి సొంతిల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోలా ఉమారాణి, కోలా నాగేశ్వరరావు, ఫటాన్ షబీర్ ఖాన్, గంగనబోయిన వెంకటేశ్వర్లు, కొప్పెరా కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ విజయరత్నం, దరిపల్లి వీరభద్రం, తూము కృష్ణ, పొనుగోటి భారతమ్మ, మేకల ప్రభాకర్, తూము పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button