
అర్థరాత్రి.. తప్పతాగి యువతి వీరంగం.. బ్రీత్ అనలైజర్ టెస్టుకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదం
Web desc : అర్థరాత్రి.. ఓ యువతి తప్పతాగి కారు డ్రైవింగ్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కారు ఆపి తనిఖీలు చేసిన పోలీసులకు చుక్కలు చూపింది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిరాకరించి నానా హంగామా సృష్టించింది.పోలీసుల విధులకు ఆటంకం కలిగించింది.
దీంతో ఆ యువతిపై కేసు నమోదు చేసి, కారును సీజ్ చేశారు పోలీసులు.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో బుధవారం అర్థరాత్రి ఓ తప్పతాగి యువతి హంగామా సృష్టించింది.
బంజారాహిల్స్ లోని ఎస్సీ స్టడీ సర్కిల్ దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారును ఆపి చెక్ చేశారు. కారు నడుపుతున్న యువతి మద్యం సేవించినట్లు గుర్తించారు.
బ్రీతీ ఎనలైజర్ టెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆ యువతి నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నిబంధనలు ఉల్లంఘించిన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఆ యువతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కారు సీజ్ చేశారు.




