
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన బానోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 19 2026: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన లచ్చగూడెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి వెంకటేశ్వరరావును బానోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్ ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
ప్రమాదంలో ఆయనకు తగిలిన గాయాల గురించి, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెంకటేశ్వరరావు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని యథావిధిగా ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఎదురైన పరిస్థితుల గురించి తెలుసుకుని, ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అవసరమైతే తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వెంకటేశ్వరరావు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలని కుటుంబ సభ్యులకు సూచించారు.




