NotificationPoliticalTelangana

150 పోస్టుల భర్తీకి హైడ్రా నోటిఫికేషన్

150 పోస్టుల భర్తీకి హైడ్రా నోటిఫికేషన్

150 పోస్టుల భర్తీకి హైడ్రా నోటిఫికేషన్

Web desc : హైడ్రాలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు 150 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డీఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు 100, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టులకు పదో తరగతి అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 35 ఏండ్లలోపు ఉండాలి.

ఎంపికలో భాగంగా అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నారు. 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకన్లలో, 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాలి. లాంగ్ జంప్‌లో 4 మీటర్లు దూకాలి. 7.26 కిలోల షాట్‌పుట్‌ను 6 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది.

అభ్యర్థులు పదో తరగతి మెమో ఒరిజినల్, ఏదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని, డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఫిజికల్ టెస్టులు ఈ నెల 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button