
కాంచనపల్లి గ్రామంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన గ్రామ సర్పంచ్ రేసు బుచ్చిరెడ్డి.
సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు ఆగస్టు 15.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో ఉన్న కంచనపల్లి గ్రామంలో గ్రామ సర్పంచి రేసు బుచ్చిరెడ్డి సమక్షంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ జక్కజంగారెడ్డి గ్రామ ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ పెద్దలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని స్వతంత్ర దినోత్సవ వేడుక జరుపుకున్నారు మీడియా ద్వారా గ్రామ సర్పంచి గ్రామ అభివృద్ధిని ఏ విధంగా చేద్దాము,స్కూలు అభివృద్ధిని ఏ విధంగా చేద్దాము అనే విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలిపినారు.




